link rel="stylesheet" type="text/css" href="http://mydatanest.com/............/slidemenu_hori.css" />

snow

5, నవంబర్ 2011, శనివారం

Mangala harathi

                           మంగళ హారతి
సాయం కాలం సమయమున సంధ్యా దీపరాధనలో
వచ్చును తల్లీ   మహా లక్ష్మీ- వ చ్చును తల్లి వర లక్ష్మీ                           ||సాయం ||

పాల సముద్రుని పుత్రికలా -  పరందాముని ప్రాణ సఖి
రావమ్మా ఏక రావమ్మా  - నను కరుణించగా రావమ్మా                            ||సాయం ||

మెడలో  ఎన్నో హారాలు- సిగలో ఎన్నో పుష్పాలు 
నవ్వుతు వచ్చును నా తల్లి - నను కరునిమ్చును  నాతల్లి                         ||సాయం ||

నను కరుణించుము   ఓయమ్మా  - నను కా పా డుము ఓయమ్మా 
నను దయ చూడుము ఓయమ్మా - నను కడతే ర్చుము మాయమ్మా            ||సాయం ||

దయ గల దేవత ధన లక్ష్మీ -వరములనిచ్చే వరలక్ష్మి
కరుణిం చే దేవత దైర్య లక్ష్మీ -కాపాడు  దేవత  భాగ్యలక్ష్మీ                             ||సాయం || 

విద్యను ఇచ్చే విద్యాలక్ష్మీ -సంతానం ఇచ్చే  సంతానలక్ష్మీ
సౌ భాగ్య మిచ్చే సౌ భాగ్య లక్ష్మీ -     రాజ్యమునిచ్చే  రాజ్యలక్ష్మీ                      ||సాయం ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి